Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోపంతో దర్శకుడు శంకర్ ను నాలుగైదు సార్లు వెనక్కి పంపించేశాను: యాక్షన్ కింగ్ అర్జున్

  • నా సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి 
  • ఆ సమయంలో నిర్మాతగా మారాను 
  • హిట్స్ తో పాటు నిర్మాతలూ వచ్చారు
శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన 'జెంటిల్ మేన్' సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతగా ఆ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులపై ప్రభావం చూపింది. అలాంటి ఈ సినిమాకి ముందు జరిగిన ఒక సంఘటనను గురించి తాజా ఇంటర్వ్యూలో అర్జున్ చెప్పుకొచ్చారు.

"ఒకానొక సమయంలో నా సినిమాలు వరుసగా పరాజయంపాలవుతూ వచ్చాయి. దాంతో నిర్మాతలు కొంతమంది నన్ను తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇల్లు అమ్మేసుకుని నేనే హీరోగా ఒక సినిమాను నిర్మించాను. ఆ సినిమా బాగా లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా .. మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. దాంతో మళ్లీ దర్శక నిర్మాతలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

అయితే 'నేను ఖాళీగా ఉన్నప్పుడు ముఖం చాటేస్తారా?' అని అందరినీ వెళ్లగొడుతూ ఉండేవాడిని. అలా నాలుగైదు సార్లు నేను వెళ్లగొట్టాక ఓ కుర్రాడు మరోసారి వచ్చి .. "కథ వినకుండా కుదరదని చెప్పడం కరెక్ట్ కాదు సార్ .. ఒకసారి వినండి" అన్నాడు. వినేసి 'నో' చెప్పొచ్చులే అనుకుని .. 'సరే చెప్పు' అన్నాను. ఆ కుర్రాడే శంకర్ .. ఆయన చెప్పిందే 'జెంటిల్ మేన్' స్టోరీ. ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో తెలిసిందే. నా సినిమా ద్వారా శంకర్ పరిచయమైనందుకు నేను ఇప్పటికీ గర్వపడుతుంటాను" అని ఆయన అన్నారు.
arjun
shankar

More Telugu News